Header Banner

త్వరలోనే ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ.. మంత్రి కీలక వ్యాఖ్యలు!

  Sun May 04, 2025 12:05        Politics

భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా సంస్థలు ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్-2025లో సహకారం అందించుకోనున్నాయని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 4 వరకు తొలిసారిగా ఇండియాలో, ప్రత్యేకించి ముంబయిలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వేవ్స్ (ది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్)-2025లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య అవగాహన ఒప్పందం (MOU) జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎంవోయూ ద్వారా ఏపీకి వచ్చే పర్యాటకులు లీనమయ్యేలా థీమ్ పార్క్‌లు, గేమింగ్ జోన్‌లు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్‌లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. అంతేకాకుండా, ఉద్యోగ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, పర్యాటకం, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ ఎంవోయూ దోహదం చేస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు.

 

ఇది కూడా చదవండి: పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ వియత్నాంలో ఉండగా, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట, క్రియేటివ్‌ల్యాండ్ స్టూడియోస్ వ్యవస్థాపకురాలు, క్రియేటర్స్ ఇంక్ లండన్ చైర్మన్ సాజన్ రాజ్ కురుప్, హాలీవుడ్ నుండి గ్లోబల్ అడ్వైజరీ బోర్డు ప్రతినిధులు డేవిడ్ ఉంగర్ (సీఈవో ఆర్టిస్ట్స్ ఇంటర్నేషనల్), గ్లోబల్‌గేట్ మేనేజింగ్ డైరెక్టర్ విలియం ఫైఫర్, నికోలస్ గ్రానాటినో (చైర్మన్ నోవాక్వార్క్) ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఇటీవలే క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ప్రతినిధులు కొందరు వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఈ విషయంపై చర్చించారు. మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఆవిష్కరణలతో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నామని అన్నారు. వినోద మౌలిక సదుపాయాలు, ప్రతిభ నైపుణ్యాలు, పర్యాటకం కలిసి జీవనోపాధిని సృష్టించడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, ప్రపంచ సృజనాత్మక పటంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫైల్‌ను పెంచడానికి ఇది ఒక సమగ్ర దృక్పథాన్ని అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు సమ్మిళిత వృద్ధిని ఎలా నడిపిస్తాయో చెప్పడానికి ఇది ఒక బ్లూప్రింట్‌గా తాము భావిస్తున్నామని ఆమె వివరించారు. 

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations